“మాలపల్లి” నవలలోని ఒక సంభాషణ
నవంబరు 17, 2008 at 11:00 పూర్వాహ్నం | In General | 6 Commentsనేను ఉన్నవ లక్ష్మీ నారాయణ గారి “మాలపల్లి” చదువుతూ ఉంటే, ఒక సంభాషణ నన్ను బాగా ఆకర్షించింది. దాన్ని యధాతథంగా ఇక్కడ టైప్ చేస్తున్నాను:
జోతి: అమ్మా! రేపెక్కడికే అయ్యా, నీవు పోవడం
వెంకటదాసు: ఎక్కడకా? దేవుడి దగ్గరకు
జో: దేవుడు తన దగ్గరకి మిమ్ములని రానిస్తాడా?
మాలక్ష్మి: ఆ,ఆ. దేవుడు రానిస్తాడు.
జో: ఇక్కడి దేవుడి గుడిలోకి మనలను రానీయరేమి?
మా: రానీయకపోతే వాళ్ళే చెడ్డారులే! మీ అన్న మనకు దేవుడి గుడి కట్టిస్తున్నాడుగా
జో: మన గుడిలోకి వస్తాడా దేవుడు?
మా: ఆహా! ఎవరు కట్టించుకున్నా వస్తాడు. ఆయనకంటు లేదు.
రామదాసు:పెద్దదేవుడు మనలోనే ఉంటే ఈ రాతి దేవుళ్ళెందుకు? రాళ్ళు దేవుళ్ళైతే రాసులు మింగవా? అన్నారు.
వెం: నీదంతా అద్వయితం. అంతా నీవంత వాండ్లయితే దేవుడి గుళ్ళక్కరలేదు. మేమంతా ముక్కులు మూసుకుని కూర్చుంటామా ఏమి?
- ఈ ఒక్క సంభాషణలోనే నాకు “దేవుడు” గురించిన రకరకాల కోణాలను స్పృశించినట్లు అనిపించింది. జోతిది అమాయకత్వం, రామదాసుది “సత్యమే శివం” లో కమల హాసన్ పక్షం తరహాది. మాలక్ష్మిది దేవుడికి అందరూ సమానమే అన్న భావం, వెంకటదాసుది దేవుడికి, తనవారు దేవుణ్ణి చూడటం కోసం గుడి కట్టించాలన్న తాపత్రేయం. నాకెందుకో ఈ సంభాషణ చూడ్డానికి సింపుల్గా ఉన్నా కూడా, చాలా చాలా ప్రభావితం చేసేదిగా అనిపిస్తోంది.
ఇదే మూసలో ఉన్న మరో డైలాగు : “పస్తులుంటే దేవుడు మీకు పుణ్యమిస్తాడట. ఆ దేవుడు దినపస్తులుండే మాకెందుకియ్యడో!”
అభిప్రాయములు »
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI
మీ ఉద్దేశ్యం…
WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.
even i read this novel, this is the best part. thanks for reminding us this again.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా hari devana — నవంబరు 17, 2008 #
Beautiful.
నవల మొత్తం చదివారా? ఈ నాల రాయడంలో ఉన్నవ ఉద్దేశం ఏమిటని మీరనుకుంటున్నారు?
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కొత్తపాళీ — నవంబరు 17, 2008 #
@కొత్తపాళీ : ఇంకా చదువుతున్నానండీ.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా vbsowmya — నవంబరు 17, 2008 #
అందుకే ఈ నవల ఎవర్ గ్రీన్…మంచి సంవాదాన్ని గుర్తుచేసారు. ఎప్పుడో చదివాను. ఇప్పుడు మళ్ళీ కొనిచదవాలనిపిస్తోంది. ధన్యవాదాలు.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కె.మహేష్ కుమార్ — నవంబరు 18, 2008 #
baagundi , nijjam gaa
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా sudheer chowdary — నవంబరు 18, 2008 #
Beautiful conversation…
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Lakshman — ఏప్రియల్ 7, 2009 #