Motivation for the day :)
మార్చి 18, 2008 at 6:56 పూర్వాహ్నం | In General | 3 Commentsఏదో ఓ చిన్న మంచి పని(అదే…మనం మంచి అనుకున్నది..) చేస్తాము. అది ఎవరికో ఎక్కడో ఓ చోట మేలు కలిగిస్తుంది. మనం ఆనందిస్తాం. వాళ్ళూ ఆనందిస్తారు. అది ఈ వ్యవహారాన్ని చూసే ఒక కోణం.
మరో కోణం, కాస్త సినికల్ కోణం – “నువ్వొక్కదానివి ఏదో చిన్న పనిచేస్తే? ఏమౌతుంది? ఏమన్నా తేడా ఉంటుందా వాళ్ళ జీవితాల్లో?”.
ఇంకో కోణం – “ఇలా చిన్న చిన్న పనులు చేయడం కాదు. ఏదో చేయాలి…. అది నిజమైన పెద్ద మార్పు తీసుకురావాలి.” (దీన్నే enterpreneurship కోణం అంటాను నేను.)
ఇక, రెండో కోణం ని చూస్తే, ప్రతి ఒక్కరూ అంత నిరాశగా ఉండరు. మూడో కోణం చూస్తే, ప్రతి ఒక్కరూ అంత పనిమంతులై కూడా ఉండరు. ఎవరికి చేతనైన విధంగా వారు చేద్దామని అనుకుంటారు. (అసలు నాకెందుకు? నేను బాగున్నా కదా! అనేసుకుంటే అసలీ టపా మీక్కాదు…:) సమస్యే లేదు అలా అనుకుంటే మీకు…)
మొదటి రకం వాళ్ళని ప్రోత్సహిస్తే మూడోరకం లోకి మారినా మారొచ్చు. చెప్పలేం. అసలీ సుత్తంతా ఎందుకు చెబుతున్నా అంటే, ఇందాకే ఓ కొటేషన్ చదివాను…చదివాక… కొండంత ఉత్సాహం వచ్చింది. అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది..సినిక్స్ వ్యాఖ్యలు విని – “ఔను.. ఇప్పుడు నేనేదో ఓ చిన్న పని చేస్తే మాత్రం తేడా ఏముంటుంది ఈ ప్రపంచానికి?” అని. ఈ కొటేషన్ నాకు జవాబిచ్చింది.
Act as if what you do makes a difference. It does. -William James,psychologist (1842-1910)
అభిప్రాయములు »
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI
మీ ఉద్దేశ్యం…
WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.
I arise in the morning torn between the desire to improve the world and a desire to enjoy the world. This makes it hard to plan the day. — E. B. White
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రాకేశ్వర రావు — మార్చి 21, 2008 #
Sowmya,
After being a member of TMAD for so many months, if you have this doubt, I wonder. Of course you want to present an answer, that is fine.
I look at this question this way:
1. Everyone has the wish the serve the society.
2. When it is more or when he sees that he can do something easily without having to think much, they will come forward to do something. This is for their own satisfaction.
3. Once they start doing things, they begin to spare time and also begin to look at the problems with interest to find solutions and how best they can do.
This is the process of change which is gradual. This is my personal experience too.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా prasanthi — మార్చి 27, 2008 #
సౌమ్య గారు , మీకు ఇంకో బ్లాగు ఉందా?? తెలియదండి ..ఇందులో కూడా చలా విషయాలు నిక్షిప్తం అయ్యాయి, తప్పకుండా దీనికి కూడా నా బ్లాగు లో ఒక లింక్ ఉండాలి.అన్నట్టు మీరురాసిన ఈ టపా మల్లి నాలో చాలా ఉత్సాహాన్ని నింపింది అంటె నమ్మండి. ఎప్పుడూ ఎదొ ఒకటి కొత్తగా, ఉత్సాహం అందరికీ సాహయం చెస్తుంది అని మొదలు పెడతాను కాని ఎదో చిన్న బావన వెనక కి లాగుతు ఉంటుంది, ఎవరొ ఒక pessimist దాన్ని నిరుత్సాహ పరుస్తూ ఉంటారు, ఇక వారి మాటలు లెక్క పెట్టెది లేదు …చాలా మంచి టపా అండి, మరొక్క సారి థాంక్యు మీకు.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Krishna — నవంబరు 30, 2008 #