రెండో భార్య కి ఆస్తిహక్కు గురించిన వార్త

జనవరి 28, 2008 at 8:05 అపరాహ్నం | In Incidents | 5 Comments

   ఈరోజు హిందూ పత్రిక లో రెండో భార్య కి భర్త ఆస్తి మీద హక్కు ఉండదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కనిపించింది. అది చదివాక కలిగిన ఆలోచనలే ఇప్పుడీ టపా రూపం లో బయటపెడుతున్నా :) అసలు టపా ఇక్కడ చదవొచ్చు.

ఇంతకీ సారాంశం ఏమిటీ అంటే – ఆస్తిపై రెండో భార్య అయిన వ్యక్తికి ఎటువంటి హక్కూ ఉండదనీ, కానీ, ఆమె సంతానానికి మాత్రం కలుగుతుంది అని. మళ్ళీ అలా అని రెండో పెళ్ళి చెల్లుతుంది అని కాదు.

” Children born of second marriage are entitled to a share in the property of their father though the second marriage itself is void, the Supreme Court has held.”

పిల్లలు లీగలంట…. పిల్లల తల్లి మాత్రం లీగల్ కాదంట. అంటే… ఆ తల్లి పరంగా చూస్తే ఆమె దిక్కులేనిదే…ఒక వేళ పిల్లలు వదిలేస్తే. పైగా ఆ వార్త తాలూకా కేసు ప్రకారం మొదటి భార్య తానే భర్త కి దూరంగా వెళ్ళిపోయింది. తరువాతే భర్త రెండో పెళ్ళి చేసుకుని నలుగురు పిల్లలు కూడా పుట్టారు. ఇప్పుడు అతను చనిపోగానే మొదటి భార్య కూడా ఆస్తి కోసం వస్తే ఇన్నేళ్ళూ కలిసి జీవించిన రెండో భార్యకి ఆస్తిహక్కు లేదంట… ఎప్పుడో వదిలి వెళ్ళిపోయిన మొదటి భార్య కి మాత్రం ఉందట! అంటే… రెండో భార్య కి ఆస్తి హక్కు కల్పించడం  అన్నది ఈ కేసు ఒక్కదాన్ని చూసి నిర్ణయించే విషయం కాకపోయినా కూడా, ఈ తరహా ప్రత్యేక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి అన్నది నాకు తోస్తుంది. అయినా, పిల్లలకి హక్కున్నప్పుడు వాళ్ళ తల్లికి ఎందుకూడదు? అన్నది ఇక్కడ ప్రశ్న.  ఇంకో ప్రశ్న ఏమిటి అంటే… మొదటి భార్య ఈ కేసులోలా తానుగా బయటకు వెళ్ళిపోయినా కూడా ఆమెకి ఆస్తి హక్కు వస్తుందా? రెండో భార్య కి మాత్రం ఎందుకు రాదు? అన్నది.

నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది ఆ తీర్పు గురించి చదివాక. సుప్రీం కోర్టు అంతటి ధర్మాసనం అలా ఎలా తీర్పిచ్చింది? , అందులోనూ ఈ కేసు విషయంలో అని.  భర్తే మొదటి భార్య ని వదిలేసి రెండో మనిషి ని పెళ్ళి చేసుకుంటే అప్పుడు రెండో భార్య లీగల్ కాదు అనడం ఒక వాదన (అదన్నా కూడా మళ్ళీ పిల్లలకిచ్చి తల్లికివ్వకపోవడం అన్యాయమే అని తోస్తుంది.) మరి ఈ పేపర్ వార్త ప్రకారం కనీసం అది కూడా కాదు కేసు.  ఏమిటో ఈ తీర్పులు! సరిగా రాసిన వ్యాసం ఇంకోటి కావాలేమో..సరైన ఐడియా రావడానికి. అయినప్పటికీ, సుప్రీం కోర్టు తీర్పు నాకు నచ్చలేదు :(

అభిప్రాయములు »

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

  1. Rajyamgam prakaram anthe..
    adi correct cheyyalsina saasanam

  2. ఆధిక జనాభా కలిగిన దేశాల్లో యిటువంటి చట్టాలు సర్వసాధారణం. ఆధిక జనాభాని నియంత్రించడానికీ, రెండో పెళ్ళిళ్ళని అరికట్టడానికీ చేసే ప్రయత్నాలివి. ఒక స్త్ర్రీ, మరో పురుషుడి ఆస్తిని చూసి రెండవ వివాహానికి సంసిద్ధం కాకూడదనేది దాని అర్థం. ఇప్పుడు జరిగే రెండో పెళ్ళిళ్లు ఎక్కువ ఈ ఆశకి లోబడే జరుగుతున్నాయి. మీరన్నట్టు ప్రత్యేక పరిస్థితులలో నిజంగా తోడిచ్చిన రెండవ భార్యకి తప్పకుండా అన్యాయం జరిగితీరుతుంది. అటువంటప్పుడు విడాకులు పొందిన పురుషుడినే పెళ్ళాడడం తప్పనిసరి. పిల్లలు లీగల్, భార్య యిల్లీగల్ అన్నారు. మరి అభం శుభం తెలీక పుట్టిన పిల్లల్ని కోర్టు శిక్షించలేదు గదా. రెండవ భార్యయితే తెలిసే ఉద్దేశ్యపూర్వకంగా చేసుకుంది కనుక ఆమెని కోర్టు తప్పు పడ్తున్నట్టుగా మనం భావించాలేమో.

  3. స్వార్జిత ఆస్తి మీద తప్ప ఇంకే ఆస్తి మీదా ఎవరికీ ఏ విధమైన ఆటోమేటిక్ హక్కూ లేకుండా చేస్తేనే ఈ ఆస్తి గొడవలు సద్దుమణుగుతాయి. అందుకని అన్నిరకాల Transfer of propety acts రద్దుచెయ్యాలి. ఆస్తికి ఎవరు స్వంతదారో అతను/ ఆమె తన ఇష్టానుసారంగా చేసిన బదలాయింపునకే చట్టబద్ధత ఉండాలి.

    రకరకాల బాంధవ్యాల్ని అడ్డం పెట్టుకుని ఇతరుల ఆస్తి కొట్టెయ్యాలని చూసేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు సమాజంలో. బాంధవ్యాన్నీ ఆస్తినీ వేఱువేఱుగా చూడ్డం మనుషులు నేర్చుకోవాలి.

  4. When it comes to the children of second wife, the judgement is apt.

    A woman is being cheated by all means and sometimes it is as a result of her own decisions. I cannot reply this post in a comment. In fact there is a serious need to write a blog on women and their problems and last but not the least, the degeneration of women.

  5. ఆడ వాళ్ళ లోనూ, మగ వాళ్ళాలోనూ అన్ని రకాల వారూ ఉంటారు.
    సమాజమూ, ప్రజాస్వామ్యంలో పాలకులూ ప్రజలే కదా.
    అంటే మనమే కదా. “మన” అభిప్రాయాలు చదివి నాకిలా అనాలనిపిస్తోంది.
    విజయకుమార్ గారు చెప్పినట్టు ఆస్తి కోసం పెళ్ళైన వాడిని చేసుకోకుండా ఉండడం కోసం
    చట్టం అలా ఉంటే, మరి ఆస్తి ఆశ చూపో లేక మొదటి భార్య గురించి అబద్ధాలు చెప్పో
    అవస్రంలో ఉన్నా ఆమెని advantage తీసుకునో పెళ్ళి చేసుకోకూదదు అనే విధంగా
    మగ వాళాని హెచ్చరించే చట్టాల గురించి తెలుపగలరు.
    మగ వాడు మోసం చెయ్య గలడు. మోసం వల్ల జరిగినా, తెలిసి జరిగినా
    ఆమె రెండో భార్య అయితే ఆమెకే నష్టం కాబట్టి ఆమే జాగ్రత్తగా ఉండాలి.
    ఇందులో కొత్తేముంది? ఆడవాళ్ళని చూసి attract అవుతాడు కాబట్టి ఆడవాళ్ళు ముసుగులేసుకోవాలి అన్న దానికీ దీనికీ తేడా ఏంటి?

    At the same time, చట్టాలూ, చదువులూ కూడా ఒకింత భద్రతనే ఇస్తాయి. ప్రతి దానికీ చట్టం చెయ్యలేము. ప్రతి సారీ దోషులను సరిగా గుర్తించలేము. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ చైతన్యవంతంగా ఉండి అవకాశం, అవగాహనా లేని వారికి సరైన దారి చూప గలిగితే కొంత మటుకు ప్రయోజనం ఉంటుంది.


మీ ఉద్దేశ్యం…

XHTML: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.