నాలుగోరోజు + నా భావాలు…

సెప్టెంబరు 20, 2007 at 3:04 అపరాహ్నం | In General | 3 Comments

నాలుగోరోజు…నిన్న నలుగురొస్తే…ఈరోజు ఏడుగురు. రోజు రోజుకీ సంఖ్య పెరగడం కాస్త ఆనందాన్ని కలిగించిందనే చెప్పాలి… ఈరోజు ఎందుకో గానీ… గత సంవత్సర కాలం లో ఈ పిల్లల తో గడపడం లో ముఖ్యమైన “గమనింపులు” ఏమన్నా ఉన్నాయా? అని ఆలోచించాను… బాగా striking గా కనబడ్డది ఏమిటంటే -

1. మునుపటి కంటే పిల్లలు బాగా తెలుగు చదువుతున్నారు

2. రెలేటివ్ గా లెక్కలు కూడా వేగంగానే చెబుతున్నారు

3. మునుపంత అల్లరి అల్లరి గా అనిపించడం లేదు

4. మునుపటి కంటే ఇప్పుడు దగ్గరైనట్లు అనిపిస్తోంది వారు నాకు

5. అప్పట్లా కొట్టుకోడం లేదు

- ఇవన్నీ ఎందుకు అనిపిస్తున్నాయంటే చెప్పలేను. వాళ్ళే మారారో…. వాళ్ళకి నేనే అలవాటు పడిపోయానో… లేక వాళ్ళు మారకపోయినా, ఇంకా ఫాం లోకి రాక అలా అల్లరి చేయకుండా ఉంటున్నారో… లేక నాబోటి వాళ్ళను చూసి జాలి పడ్డారో… నాకే సహనం,ఆప్టిమిజం పెరిగాయో….. నాకు మాత్రం ప్రస్తుతానికి అర్థం కావడం లేదు…. ఏదో ఒకటి వాళ్ళు మునుపటికంటే చురుగ్గా ఉన్నారు…. అది చాలు నాకు…. దానికి ఆషాకిరణ్ కారణం కాకపోయినా పర్వాలేదు. :) అయి ఉంటే మాత్రం అది మేము సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం :)

ఒకానొకప్పుడు పోయినేడు ఈ టైం కి ఈ పిల్లల్నే చూసి పిల్ల రాక్షసుల్లా ఉన్నారు బాబోఇ అని నీరసించిన ఓ సాయంత్రం గుర్తు వచ్చి ఈ క్షణం లో కాస్త ఆశ్చర్యం – “ఈ పిల్లలేనా వాళ్ళు!” అని…. కాస్త చిర్నవ్వు…”ఆ నేనేనా నేను” అని….. “నిలువద్దము నిను ఎపుడైనా…నువు ఎవ్వరు అని అడిగేనా? ఆ చిత్రమె గమనిస్తున్నా కొత్తగా….” అని పాడుకోవాలనుంది :)

మళ్ళీ బడికి!

సెప్టెంబరు 20, 2007 at 3:24 పూర్వాహ్నం | In What do you say? | 7 Comments

మా ఆషాకిరణ్ స్కూల్ మళ్ళీ తెరుచుకుంది ఎట్టకేలకు బాలారిష్టాలన్నీ దాటుకుని. నిన్న మూడో రోజు. ఈ వానొకటి తగలడి వరుసగా – సున్నా,రెండు,నాలుగు మంది పిల్లలు ఈ మూడు రోజుల్లో. మళ్ళీ పిల్లల మధ్యకు… “మళ్ళీ బడికి” వెళ్ళడం ఆనందంగా ఉంది. ఈ టపా తో ఓ గేమ్ ని గురించి కొంచెం కారంగా, కొంచెం గారంగా చెప్పడం, మీనుంచి మీకు తెలిసిఉన్నచో పంచుకోవాల్సిన ఓ విషయం తెలుసుకోడం నా ముఖ్య ఉద్దేశ్యం.

నల్గురు పిల్లలు…ఇద్దరు జూనియర్ బ్యాచ్, మిగితా ఇద్దరు సీనియర్ బ్యాచ్. రెండు బ్యాచ్ లకీ రీడింగ్ సెషన్ ఈరోజు. కథలు. ఇదివరకటి కంటే వీళ్ళ Reading skills చాలానే అభివృద్ధి చెందాయి. మంచిదే. దీని ఆషాకిరణ్ కారణం అనేమీ చెప్పలేము. వాళ్ళు ఒక ఏడు పెద్దవారవడం కావొచ్చు, లేకుంటే వాళ్ళ సర్కారీ బళ్ళో నిజంగానే బాగా చెప్పారేమో ఈ మధ్య. ఏదైనా, నాకైతే ఆనందం కలిగింది వాళ్ళ performance కి. సరే, ఓ గంట అలా ఈ పుస్తక పఠనం అయ్యాక “అబాకస్” అని ఒక ఆట మొదలుపెట్టాం… నల్గురు పిల్లలు ఆట. మేము పక్కన చూడ్డం. ఇదేమో snakes & ladders తరహా ఆట. కాకుంటే ప్రతి డబ్బా లోనూ ఏదో లెక్కల సమస్యలు ఉంటాయి… నీ డైస్ పై ఉన్న సంఖ్యల మధ్య తేడాని రెండు తో గుణించి అన్ని గళ్ళు ముందుకు వెళ్ళు అనో, లేకుంటే.. నీ డైస్ పై ఉన్న సంఖ్య ల కూడిక పదైతే ఒక గడి ముందుకు, లేకుంటే మూడు గళ్ళు వెనక్కో..అలా ఏదో. ఒక విధంగా ఈ ఆట పిల్లలలు చాలా ఉపయోగకరం…mental math కోసం. అయితే, సమస్యల్లా ఏమిటీ అంటే – ఇది పూర్తి చేయాలంటే ఓ రోజు పడుతుంది కాబోలు. ఒక అడుగు ముందుకేస్తే రెండడుగులు వెనక్కి వెళ్ళడం ఖాయం. ఆటన్నాక మరీ ఇంత పెస్సిమిస్టిక్ గా ఉంటే ఎలా? ప్రతి చోటా – “else move backward…” అన్న కండీషన్ వర్తించే అవకాశాలే ఎక్కువ. మొదట్లో కాసేపు ఇది కాస్త విసుగు పుట్టించింది కానీ, కాసేపయ్యేసరికి మునిగిపోయారు పిల్లలు అందులో. మళ్ళీ రేపు కూడా ఆడదాం అని చెప్పి దుకాణం కట్టేయాల్సి వచ్చింది. :)

ఈ ఆట ఆడించే క్రమం లో ఓ పెద్ద సమస్య భాష. ఆ ఆట లో గళ్ళపై అంతా ఆంగ్లం లో రాసి ఉండటం వల్ల పిల్లలు అర్థం చేసుకోలేకపోయారు. మేము పక్కనే కూర్చుని వాళ్ళకి ప్రతిసారీ వివరించాల్సి వచ్చింది. ఎటొచ్చీ వాళ్ళకి దీని వల్ల కూడా కొత్త పదాలు తెలిసాయి…అది వేరే విషయం. కానీ, నాకు తెలియాల్సింది ఏమిటీ అంటే – ఇలాంటి ఆటలు తెలుగు లో రాసి దొరుకుతాయా? అంటే గళ్ళలో అంగ్లం కాక తెలుగు. ఎక్కడా దొరక్కపోతే మేమే తయారు చేస్తాం ఏమో..చెప్పలేను కానీ, ఎంతైనా ఆ కంపెనీల బోర్డుల లుక్ రాదు కదా మేము తయారు చేసిన బోర్డు కి? అందుకని, తెలుగు లో రాసి ఉండేవి దొరికే అవకాశాలుంటే చెప్పండి… కొనుక్కుని ఆషాకిరణ్ కి ఉపయోగిస్తాం. పిల్లలకే ఇంగ్లీషు నేర్పుకోవచ్చు గానీ, వాళ్ళకి తెలుగే కాస్త ఇప్పుడిప్పుడు సరిగ్గా చదవడం, రాయడం వస్తోంది… కనుక కొన్నాళ్ళాగుదాం అని.

మీకు ఈ తెలుగు లో ఇంగ్లీషు ఆటలు (హాహా) ఎక్కడన్నా దొరికే చోటు తెలిస్తే ఇక్కడో కామెంటు రాయండి…

WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.