వేట అనబడు ఈరోజుటి ఫీల్డ్ ట్రిప్ కథలు
ఆగష్టు 22, 2007 at 6:30 అపరాహ్నం | In Incidents | 10 Comments ఈ కార్యక్రమానికి ఈరోజే నేను ఫీల్డ్ ట్రిప్ అని నామకరణం చేసుకున్నాను. ఏ కార్యక్రమం? అంటే – ఆషాకిరణ్ పనులపై చుట్టూపక్కల ఉన్న స్లం ఏరియాలకు వెళ్ళి వచ్చే కార్యక్రమం. అసలు స్కూలు వరకు అయితే నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. పిల్లలే మా కాలేజీ క్యాంపస్ కి వచ్చేవారు. ఈ మధ్య మెడికల్ క్యాంపుల campaigning లో నేనూ వేలు పెట్టడం మొదలెట్టడం తో…. నా ఫీల్డ్ ట్రిప్పులు మొదలయ్యాయి. వెళ్ళినదాన్ని ఊరుకోక వాళ్ళ యోగ క్షేమాలు తెలుసుకోడం లో ఆసక్తి చూపడం తో మళ్ళీ నాకే వెళ్ళాలి అనిపించడం మొదలైంది. ఈరోజు వెళ్ళిన ట్రిప్పు ఉద్దేశ్యం వేరు, ఐతే. కొంతమంది ఆషాకిరణ్ స్నేహితులెవరో బాగా చదగలిగే కెపాసిటీ ఉన్న పిల్లల్ని వారికి వీలున్నంత వరకూ చదివించడానికి మూందుకు వచ్చారట. అలాంటి వారిని కనిపెట్టడానికి వేట ఈరోజు main purpose.
దానిలో భాగంగా రకరకాల తల్లిదండ్రుల్ని కలిసాను. ప్రధానంగా మూడు రకాలు – పిల్లలు చదవాలి అన్న తాపత్రేయం లో రాత్రి పగలు కష్టపడే వాళ్ళు, పిల్లలు చదువుకుంటాం అన్నా కూడా సంపాదన పరమైన ఇబ్బందుల వల్ల చదివించలేని వారు. పిల్లల సంపాదన కోసం వాళ్ళ చదువు మాంపించిన వారు. మరి పిల్లల్లో కూడా కొన్ని రకాలు – బాగా చదువుకుంటూ ఉన్న పిల్లలు, బాగాచదువుతూ ఏవో కారణాల వల్ల మానేసిన పిల్లలు, బాగా చదివినా కూడా సంపాదనలో పడి చదవడం మీద ఆసక్తి చూపని పిల్లలు, పెద్దగా చదివే సామర్థ్యం,ఆసక్తి లేకుండా – పేరుకి చదువుకుంటున్నాం అని చెప్పే పిల్లలు – ఇలా అన్నమాట. ఒక్క రోజులో ఎలా చెప్పావు? అనొచ్చు మీరు… ఇందులో చాలా భాగం ఈ ఒక్క రోజు observation కాదు. వెళ్ళిన ప్రతిసారి చూస్తున్నవే. Universal గా దాదాపు “నువ్వు పెద్దయ్యాక ఎమౌతావ్?” అని అడిగిన స్కూలు వయసు పిల్లలందరూ…అదీ ఈ వాతావరణం లో నుంచి వచ్చినవారు – “డాక్టర్ ఔతాను” అనే అంటారు. ఉండబట్టలేక, ఈరోజు అలా అన్న మీనా అనే అమ్మాయిని అడిగాను… ఎందుకు అందరు డాక్టర్ అంటారు అని…. మీనా అంటే మా కాలేజీ ఎదురుగుండా ఉన్న టీకోట్టు వాళ్ళ అమ్మాయి. నాకు కాస్త సన్నిహితంగా తెలుసు, మా స్కూలు లో నాకు ఫేవరెట్ స్టూడెంట్ కావడం మూలాన
.. ఆమె జవాబు – “డాక్టర్ కి ఉన్నంత గౌరవం ఇంకోకరికి ఉండదు కదా అక్కా.” (ఆ మధ్య వరకు టీచర్ అనేది… మా స్కూలు ఇంకా తెరవకపోవడం తో అక్కా అనడం మొదలెట్టింది..
)
మీనా వాళ్ళ అమ్మ గురించి, ఇంకా ఈరోజు ట్రిప్పు లో మొదట కలిసిన సావిత్రమ్మ కుటుంబం గురించీ - ప్రత్యేకంగా మరో పోస్టు రాయాల్సిందే. అవి రెండూ కాస్త రెండు రకాల కేసులు. మిగితావి ఒక తరహా కేసులు. ఈరోజు నాకు అర్థమైంది ఏమిటి అంటే అన్ని సంధర్భాల్లోనూ -”Teach them to catch fish” అన్న సలహా పనిచెయ్యదు అని. పేర్లు చెప్పకుండా ఓ కేసు చెబుతాను. ఓ అమ్మ, ఓ నాన్న. వాళ్ళకి నల్గురు పిల్లలు..వాళ్ళలో మొదటి ముగ్గురు ఆడపిల్లలు. పెద్దమ్మాయి పెళ్ళైపోయింది. రెండో పిల్ల తెలివైనది. పది పాసయ్యింది. తనకి చదువుకోవాలని ఉంది. తల్లిదండ్రులకి ఉందో లేదో అన్నది నాక్కాస్త అనుమానంగా ఉంది. They can’t afford her studies అన్నది ఒక స్పష్టమైన కారణం. మరేవన్నా ఉంటే ఉండొచ్చు. ఇక, ఆ తండ్రి కి చెడు అలవాట్లు ఏమన్నా ఉన్నాయేమో తెలీదు కానీ, మనిషి కాస్త పెద్దతనే. చివరి ఇద్దరు పిల్లలు తప్ప అంతా పనికి పోతే, అలా జీవించగలుగుతున్నారు. ఇప్పుడు ఆ పిల్లకి Teach them to catch fish paradigm లో ఏమి చేయాలి? చదువు చెప్పించాలి అసలైతే ఏ పారాడైం లో అన్నా. మళ్ళీ మన నుంచి కమిట్మెంట్ లేనిదే పిల్లని తల్లిదండ్రులు చదివించరు. మనమెందుకు కమిటవ్వాలి? వాళ్ళకి లేని ఆసక్తి మనకెందుకు? అన్నది ఒక వాదం. మొత్తం మనం చేయకుండా వాళ్ళకి సపోర్టు గా నిలబడ్డం … అన్నది ఈ కేసు లో ఎలానో నాకు అర్థం కావడం లేదు. ఎలాగో మొత్తం మనం కమిట్ కాలేము… ఆమె చదువు ఆమే చదూకోవాలి..ఆమె పరీక్ష ఆమే రాయాలి…మనం పోయి కూర్చోలేం కదా..
సారంశం ఏమిటి అంటే – ఇప్పుడీ విషయం లో వాళ్ళకి చేపలు పట్టడం నేర్పడం అంటే…ఏ చేపలో, ఏ జాతివి పట్టాలో… కాస్త తెలిస్తే చెప్పండి… అవి ఆచరనలో సాధ్యమైతే మీ పేరు చెప్పుకుని ఆ పని చేస్తాము ఇక్కడ మేము
ఏదన్నా స్పెషల్ గాలం ఉంటే దాన్ని ఎలా దొరకబుచ్చుకోవాలో కూడా చెప్పండి.
WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.