Ill-manners??
జులై 21, 2007 at 5:38 అపరాహ్నం | In General | 5 Comments మనుష్యులు ఇంత కేర్‌లెస్ గా ఉంటారు అన్నది మాత్రం నాకు అసలు అర్థం కాలేదు. ఈరోజు నేను బండి నడుపుతూ రోడ్డు పై వెళుతున్నాను. వెనక మా అమ్మ కూర్చుని ఉంది. రోడ్డేమో చిన్నది. అవతలవైపు నుంచి ఓ కారు వస్తోంది…నా బండి పక్కగా వెళ్ళింది ఆ కారు. అసలే రోడ్డు పై స్ట్రీట్ లైటు కూడా లేదు. కారు వాడేమో సగం తాగిన కాలుతున్న చిగెరెట్టు కిటికీ లోంచి విసిరేసాడు!!! కాస్తుంటే అది నా బండి మీద పడాల్సింది… ఏదో నా టైం బాగుండి పక్కన పడ్డది. ఎవర్నని అనగలం? ఆ చిన్న రోడ్డు లో మనం ఆపి గొడవ మొదలెడితే వేరే రకం గొడవ మొదలౌతుంది అక్కడ… ట్రాఫిక్ జాం గొడవ! మనసులో తిట్టుకుని ముందుకు కదిలాము.
ఇంత కేర్‌లెస్ గా ఎందుకు ప్రవర్తిస్తారో మనుషులు. పొగ తాగడం మంచి అలవాటా? కాదా? అన్న విషయం పక్కన పెడితే … బహిరంగ ప్రదేశాల్లో ఈ ప్రవర్తన ఎంత వరకు సమర్థనీయం? బస్సుల్లో తాగిన పీకలు అక్కడే పడేయడం.. లేదా…కిటికీల్లోంచి కిందకు ఉమ్మడం … తాగి బస్సెక్కి పక్క వాళ్ళ మీదకి తూలడం … ఇవి అన్నీ తలుచుకుంటేనే ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయి..? “అసలు అవతలివైపు నేనుంటే?” అని ఆలోచించరా ఈ పనులు చేసేవాళ్ళు??
అభిప్రాయములు »
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI
మీ ఉద్దేశ్యం…
WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.
అందుకేగా బహిరంగ ప్రదేశాల్లో పొగ త్రాగకూడదని రూలు పెట్టారు.అయినా సభ్యత అన్నది అవతలి వ్యక్తుల వ్యక్తిత్వం మీద వుంటుంది.సిగరెట్ అలాగే విసిరేస్తే[ఒక్కోసారి ఇళ్ళు తగలబడొచ్చు కూడా.మా వూరిలో నేనే ప్రత్యక్ష సాక్షిని ] ఏమవుతుందో అన్న ఆలోచన వుండేవాడయితే అసలు కాలిస్తే ఏమవుతుంది అని కూడా ఆలోచించగలడేమో?
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా radhika — జులై 21, 2007 #
సభ్యత, సంస్కారాలు పక్కనపెట్టండి. ఇది పూర్తిగా నిర్లక్ష్యం తొ కుడుకున్నది. మీరు తెలిపిన సంఘటనలో, మీ స్కూటర్ వెళ్ళిన తర్వాత సిగిరెట్ పీక విసిరివేయటమన్నది సభ్యత; అసలు రోడ్డు మీద సిగిరెట్ తాగకుడదన్నది సంస్కారము. కాని ఆ పొగరుబోతెవ్వరో, ఎవడికేమైతే నాకేంటి అనే నిర్లక్ష్యంతో చేసినపని అది. పబ్లిక్ ఏరియలలో, సిగిరెట్ పీకలు విసిరివేయటం, కిళ్ళి నమిలి ఉమ్మి వేయటం సాధారణమైంది. ఈ విధమైన నిర్లక్ష వైఖరి నడిమంత్రపుసిరి నగరవాసులలో కొట్టచ్చినట్లు కనిపిస్తున్నది. అదేమంటే, అనవసరమైన రాద్దంతం. జనే దొ! పబ్లిక్ క మాల్ అనే ఉచిత సలహ ఒకటి.
…వల్లూరి
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా వల్లూరి — జులై 22, 2007 #
అవును
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రాకేశ్వర రావు — జులై 22, 2007 #
No smoking in public places is a rule on paper
The saddest thing is that the conductors and the bus drivers smoke in the bus,which has a warning painted in bold letter”no smoking”
Unless the govt and educational institutions issue severe punishments,we cant ban smoking(at least in public places)
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Lalitha Sravanthi — జులై 22, 2007 #
Indeed, there is a rule on ban of smocking in public places. came very recently (five years back ? )
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా chavakiran — జులై 23, 2007 #