రైతుల ఆత్మహత్యలు
జూన్ 26, 2007 at 9:49 పూర్వాహ్నం | In Incidents | 7 Commentsఇవాళ ఉదయం హిందూ పేపర్ లో P.Sainath రాసిన ఓ వ్యాసం చదివాను. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలు ప్రస్తుతం ఏమి చేస్తున్నాయి అన్న విషయం పై రెండు ఉదాహరణలతో రాసిన వ్యాసం అది. అది చదివాక ఒక విధమైన – “ఇది” అని చెప్పలేని తరహా – బాధ కలిగింది. ఇప్పుడే మరో వ్యాసం చూసాను – Andhra pradesh – Suicide for survival అని Binu Matthew రాసిన వ్యాసం. “A unique drama is being played out in the South Indian state of Andhra Pradesh. Grim, dark and unbelievable yet horrifically real.” అంటూ మొదలైంది. నిజానికి ఈ విషయం వినడం కొత్తేమీ కాకపోయినా కూడా ఈ తరహా భాష లో వినడం ఇదే తొలిసారి. కాబట్టి తగలాల్సిన దాని కంటే ఎక్కువగానే తగిలింది దెబ్బ నాకు.
“Driven to desperation farmers in the state are committing suicide with the hope of getting the relief package offerered for the survivros of deceased…” చదువుతూంటే మనసంతా ఎదోలా అయిపోయింది. ఆత్మహత్యకి ముందు తమ కుటుంబాల గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారనిపిస్తుంది. మళ్ళీ మరు క్షణం లో అదే నిర్ణయం బాధ్యతారాహిత్యం గా, తన వారిని నట్టేటిలో ముంచేసేలా అనిపిస్తుంది. ఈ ఆత్మహత్యల పర్వం ఎవరి బాగు కి? ఎవరి బాధ కి? అన్నది నాకో చిక్కు ప్రశ్న గా మారింది చివరికి. బాధితులు, లాభితులు కూడా ఒకరేలా కనిపిస్తున్నారు. మన వ్యవసాయానికి వర్షం కోసం చాతక పక్షి లా ఎదురు చూడ్డం తప్ప మరో మార్గాంతరం లేదా?? మన రైతులకి ప్రకృతి వంచిస్తే కోలుకునే మరో మార్గం లేదా? పరిస్థితి చక్కబడడానికి ప్రభుత్వం పాత్ర ఏమిటి? సామాన్యులు ఏమన్నా చేయగలరా?
- అప్పుడోసారీ, ఇప్పుడోసారి చదవడం మినహా ఈ సమస్యతో నాకు ప్రత్యక్ష సంబంధం లేదు కనుకే ఇన్ని సందేహాలు.
WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.