Skin Bank

ఫిబ్రవరి 12, 2007 at 1:48 అపరాహ్నం | In General | Leave a Comment

స్కిన్ బ్యాంక్ అని కూడా ఒకటుంటుందని నాకు ఈరోజే తెలిసింది. లైబ్రరీ లో వార్త సండే మాగ్ లోనో ఆంధ్రజ్యోతి లోనో ఒక కథ చదివాను. కథంటే అది నిజ జీవిత సంఘటన.skin bank గురించి ఆసక్తి కరమైన విషయాలు తెలిసాయి.

చర్మాన్ని సరైన పద్ధతులు ఉపయోగిస్తే 2.5 ఏళ్ళ దాకా నిలవ ఉంచొచ్చు అట. అగ్ని ప్రమాదాల్లో చర్మం కాలిన వారికి సాధారణంగా శరీరం లోనుంచే తొడ దగ్గరి నుంచి గానీ, ఇంకెక్కడినుంచి అయినా కానీ చర్మం తీసి అతికిస్తారు కాలిన చోట్ల. కానీ.. చాలా భాగం కాలిన వారి సంగతి ఏంటి? ఆ ప్రశ్న కు ఈ కథలోని నాయిక చెప్పిన జవాబే ఈ skin bank.

ఆలోచిస్తే దీని అవసరం ఎంత ఉందో తెలుస్తోంది. దీనికి ఇచ్చే దాతలకి మామూలుగా రక్తదానం చేసినట్లు కాదు. కొన్నాళ్ళ పాటు చాలా నొప్పిగా కూడా ఉంటుందంట. నడవడం కూడా కష్టం అవుతుందట. అయినప్పటికీ ఇచ్చే వారు ఉన్నారంటే మానవత్వం rox అనే కదా! ఏమైనా ఈరోజు ఈ విషయం తెలిసిన  క్షణం నుండి నాకు మన దేశం లో ఇలాంటిది ఏమన్నా ఉందా అన్న సందేహం వచ్చింది. లేదనుకుంటా. మీకెవరికి అయినా తెలిస్తే ఇక్కడ ఓ కామెంటెయ్యండి. నేనింతలోపు కాస్త సవివరంగా ఇంకో పోస్టు రాస్తా literature survey చేసి. :)

No Comments Yet »

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

XHTML: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.