Skin Bank
ఫిబ్రవరి 12, 2007 at 1:48 అపరాహ్నం | In General | Leave a Commentస్కిన్ బ్యాంక్ అని కూడా ఒకటుంటుందని నాకు ఈరోజే తెలిసింది. లైబ్రరీ లో వార్త సండే మాగ్ లోనో ఆంధ్రజ్యోతి లోనో ఒక కథ చదివాను. కథంటే అది నిజ జీవిత సంఘటన.skin bank గురించి ఆసక్తి కరమైన విషయాలు తెలిసాయి.
చర్మాన్ని సరైన పద్ధతులు ఉపయోగిస్తే 2.5 ఏళ్ళ దాకా నిలవ ఉంచొచ్చు అట. అగ్ని ప్రమాదాల్లో చర్మం కాలిన వారికి సాధారణంగా శరీరం లోనుంచే తొడ దగ్గరి నుంచి గానీ, ఇంకెక్కడినుంచి అయినా కానీ చర్మం తీసి అతికిస్తారు కాలిన చోట్ల. కానీ.. చాలా భాగం కాలిన వారి సంగతి ఏంటి? ఆ ప్రశ్న కు ఈ కథలోని నాయిక చెప్పిన జవాబే ఈ skin bank.
ఆలోచిస్తే దీని అవసరం ఎంత ఉందో తెలుస్తోంది. దీనికి ఇచ్చే దాతలకి మామూలుగా రక్తదానం చేసినట్లు కాదు. కొన్నాళ్ళ పాటు చాలా నొప్పిగా కూడా ఉంటుందంట. నడవడం కూడా కష్టం అవుతుందట. అయినప్పటికీ ఇచ్చే వారు ఉన్నారంటే మానవత్వం rox అనే కదా! ఏమైనా ఈరోజు ఈ విషయం తెలిసిన క్షణం నుండి నాకు మన దేశం లో ఇలాంటిది ఏమన్నా ఉందా అన్న సందేహం వచ్చింది. లేదనుకుంటా. మీకెవరికి అయినా తెలిస్తే ఇక్కడ ఓ కామెంటెయ్యండి. నేనింతలోపు కాస్త సవివరంగా ఇంకో పోస్టు రాస్తా literature survey చేసి.
Development ? indeed!
ఫిబ్రవరి 2, 2007 at 4:19 పూర్వాహ్నం | In General | 2 Commentsమొన్నామధ్య రెపబ్లిక్ డే రోజు కాలేజీ లో జరిగిన చిన్న సమావేశం లో మా ప్రొఫెసర్ ఒకాయన మాట్లాడుతూ : ఆయన కొత్త గా కాలేజీ నుండి బయటకు వచ్చిన నాటి పరిస్థితులనూ, ఇప్పటి పరిస్థితులనూ పోల్చి చూస్తూ, మనం రోజు రోజు కీ prosper అవుతున్నాం అని తేల్చారు. దానికి బోలెడు ఉదాహరణలు కూడా చెప్పారు. అయితే ఇన్ని ఉదాహరణల్లో technology ఎలా ఎదిగిపోతోంది, దాని వల్ల మనం ఎలా లాభపడుతున్నాం, పెరిగిన ఉద్యోగావకాశాలు … ఇవన్నీ చెప్పారు కానీ, పెద్దగా మార్పు లేని జీవితాల ప్రస్తావన తేలేదు. research university లో పెద్దలకి అవన్నీ ఆలోచించే తీరిక ఉండదేమో కానీ, ఆయన మనం prosper అవుతున్నాం అనగానే నాకైతే “ఎక్కడ?” “ఎవరు” అన్న ప్రశ్నలకు నా మనసు చెప్పిన జవాబులు, నిజాలు కాబట్టి చాలా చేదుగా అనిపించాయి.
మా కాలేజీ లోనే సాయంత్రం ఆషాకిరణ్ స్కూలు ఉంది. ఓ సారి సెలవుల తర్వాత పిల్లల్ని తీసుకురావడానికి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళాను. అప్పుడు చూసాను – వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారో! అలాంటి చోట్ల ఉంటూ, చదువు మీద శ్రద్ధ పెట్టడం, పెట్టినా, ఆ చాలీ చాలని వసతుల మధ్య పైకి ఎదగడం ఎంత కష్టమో నాకు అనుభవమైంది. మరి, ఎక్కడి అభివృద్ధి అన్నట్లు? విద్యావకాశాలు – డబ్బు తో ముడిపడినవి. నాకు తెలుసు. ఈ ఘనత వహించిన మా కాలేజీ లోనే – (నేను ఫ్రీ గా, ఫీజు లేకుండానే చదువుతున్నా కూడా) BTech పిల్లలకి నెలలకి 75000 రూపాయల దాకా అవుతుంది. అంతెందుకు, ఒకానొక అతి సాధారణ కాలేజీ లో BTech చేయాలంటే ప్రస్తుతం 22 వేలంట. దాన్ని ఇంకా పెంచాలని యాజమాన్యాల గోల. నిజమే – మా గొప్ప అభివృద్ధి. BTech, MBBS లే చదువులు అని నేను అనడం లేదు. ఇక్కడ గచ్చిబౌలి ప్రభుత్వ పాఠశాల లో చదువులను గురించి కూడా ఇదే అంటున్నాను. బాగా జేబులు నిండుగా ఉంటే పిల్లకి మంచి exposure వచ్చే కాలం ఇది అంటున్నా.
నాకో నమ్మకం : అట్టడుగు న ఉన్నవారిని పైకి తేవాలంటే చదువు ఒక గొప్ప మార్గం అని. కానీ, అభివృద్ధి మహా ఎక్కువై పోయి, చదువు కూడా వాళ్ళకి అందకుండా వెళ్తోంది. అయినా మనది మాత్రం బాగా అభివృద్ధి చెందుతున్న దేశం. నిజం!
WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.