సత్యమే శివం
నవంబరు 7, 2006 at 5:36 పూర్వాహ్నం | In Incidents | 5 Comments కొన్ని సినిమాలు జీవితాన్ని మనం చూసే విధానాన్నే మార్చేస్తాయి. అలా నన్ను ప్రభావితం చేసిన ఒక సినిమా “అన్ బే శివం” లేదా “సత్యమే శివం”. మానవ సేవే మాధవ సేవ అని చెప్పిన తీరు లో గొప్ప శక్తి ఉంది. నాకు… సరిగా గుర్తులేదు… గుర్తు ఉన్నంత వరకు ఇవే అనుకుంటా పదాలు:
“ఆస్తికులైన హితులందరికి శివమే సత్యమట
నాస్తికులైన స్నేహితులకు మరి సత్యమే శివమంట”
ఈ దేవుడేంటో … ఈ కాన్సెప్ట్ ఏంటో అని తలకొట్టుకునే రోజుల్లో చూసా ఈ సినిమా ని. మానవత్వాన్ని మించిన దేవుడు లేడని ఎంత ప్రాక్టికల్ గా చెప్పారంటే – ఆ రోజు నుండీ ఈ రోజు దాకా నేను అదే మార్గం లో ఉన్నా. నాలో కలిగిన అయోమయం చాలా వరకు పోయింది ఈ సినిమా సంభాషణ లు విన్నాక. ప్రతి మనిషి లోనూ దేవుడు ఉన్నాడు – ఇంకొకరి క్షేమం గురించి ఆలోచించే ప్రతి మనిషీ దేవుడే అన్న సందేశం సూటిగా నా గుండెల్లో అలా దిగిపోయి – పాతుకుపోయింది. అయితే – ఈ సందేశాన్ని ఆవేశం గానో, మనుష్యుల్ని ఈసడిస్తూనో ఇవ్వలేదు. పూర్తి స్థాయి హాస్యం తో ఇచ్చారు. అది నన్ను అంత లా కట్టిపడేసి నడిస్తే ఈ బాట లో నడవాలి అనిపించేలా చేయడానికి కారణం ఇదే అనుకుంటా.
ఈ సినిమా కి సంబంధించినంత వరకు ఇది కాకుండా ఇంకా ఎన్నో చెప్పుకోవలసిన విషయాలు ఉన్నాయి. కానీ నేను నేర్చుకున్న జీవిత పాఠం ఇది : దేవుడు ఎక్కడో ఉండడు. దేవుడు నీలో ఉన్నాడు. నాలో ఉన్నాడు. నీ తోటి మనిషి కష్టాన్ని నువ్వు పంచుకున్నప్పుడో, లేక ఆ కష్టం తీరడానికి నువ్వు తోడ్పడినప్పుడో నీలోని దేవుడు ఎదుటివారికి కనిపిస్తాడు. అలాగే జీవితం లో నువ్వు ఈ రెండో వైపు చిక్కినప్పుడు ఎదుటి వారి లోని దేవుణ్ణి నువ్వు చూడగలుగుతావు. అని.
“ఆస్తికులైన హితులందరికి శివమే సత్యమట
నాస్తికులైన స్నేహితులకు మరి సత్యమే శివమంట”
WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.