Evening on Gachibowli mainroad
సెప్టెంబరు 20, 2006 at 3:37 అపరాహ్నం | In Incidents | 1 Commentనాకు చాలా విషయాలు ఎందుకో గానీ తలకెక్కవు. అలాంటిదే ఇదీనూ. ఈ రోజు మా ఆషాకిరణ్ పిల్లల్ని రోడ్డు దాటిస్తున్నాం. 13 మంది పిల్లలు. ముగ్గురం వాలంటీర్లం. గచ్చిబౌలి మెయిన్ కూడలి. ఆఫీసులు వదిలే టైము. గమనించలేదు కానీ రోడ్డు నిండా ట్రాఫిక్ పోలీసులు. మేము పిల్లలతో రోడ్డు క్రాస్ చేసేందుకు వచ్చామో లేదో అక్కడున్న పోలిసాయన పొలికేకలు మొదలెట్టాడు. సరే పిల్లలందర్నీ ఆగమని మేమూ రోడ్డు పక్కగా నిలబడ్డాం. అయినా ఆయన అరుపులు మానలేదు. మాకు ఎందుకో అర్థం కాలేదు. రోడ్డు పక్కగా ఉంటే చాలదట. ఇంకా వెనక్కి నడిచి, అక్కడ ఏదో త్రవ్వకాల పనుల మట్టి అనుకుంటా గుట్టగా పోసి ఉంచారు … చీకట్లో సరిగా గమనించలేదు … దాని మీద కి వెళ్ళిపోయి నిలబడ్డాం. అక్కడికీ శాంతించలేదు మనిషి. ఏదో అరుస్తూనే ఉన్నాడు. ఏమన్నా మాట కు మాట అందామన్నా పోలిసాయన కదా ఏం చేస్తాడో అన్న వెధవ భయం ఒకటి ఏద్చింది కద !!
కాసేపలాగ ఎదురుచూసాం. మా అదృష్టం అనుకుంటా గానీ రోడ్డు కి అన్నివైపులా ట్రాఫిక్ నిలిపేసిన పదినిముషాలకే ఆ వీవీఐపీ లు ఎవరో త్వరగా తెమిలి పుణ్యం కట్టుకున్నారు. 12 సరిగ్గా 12 వాహనాలు వరుసగా వెళ్ళాక పోలిసాయన మమ్మల్ని వదిలాడు. అసలైతే ఇవన్నీ మామూలే. నేను గగ్గోలు పెట్టడం అనవసరం. కానీ అంత మంది చిన్న పిల్లలు ఉన్నారు కదా …. కాన్వాయ్ రావడానికి ఇంకా టైం ఉంది అని తెలిసినప్పుడు వాళ్ళని రోడ్డు దాటనిస్తే ఏం పోయింది ? పైగా ఆ అరుపులొకటి. అయినా ఎవరిని ఏమనగలం ? పాపం వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? ఈ ఆలోచనలు పక్కన పెడితే ఈ తతంగం … అదే అసలే ట్రాఫిక్ జాం లతో అల్లాడే నగరం లో ఇలా కృత్రిమంగా జాం లు సృష్టించడం అవసరమా ? అని నా సందేహం.
ప్రజల కోసం ప్రజలే ఏర్పాటు చేసుకున్న ఈ ప్రభుత్వాధికారుల కోసం ప్రజల్నే ఇబ్బందికి గురిచేయడం న్యాయంగా అనిపించడం లేదు. ఈరోజు నేనేదో కష్టపడిపోయానని కాదు ఇదంతా చెప్తున్నది. ఇలాంటివి ఈ నగరం లో ఉన్నందుకు చాన్నాళ్ళుగా చూస్తూనే ఉన్నా. ప్రశ్నించుకుంటూనే ఉన్నా. ఈరోజేదో ఈ బ్లాగు ఉంది కాబట్టి పంచుకుంటున్నా.
That Slum area boy …….
సెప్టెంబరు 16, 2006 at 4:54 పూర్వాహ్నం | In People | 4 Commentsచాన్నాళ్ళ క్రితం నాటి మాట. అంటే పూర్వ కాలం కాదు. ఈ కాలమే. నా కాలమే. ఓ రోజు నేను చూసిన ద్రుశ్యం నన్ను ఇంకా వెన్నాడుతూ ఉంది. ఆ దిశ గా తర్వాత కూడా నేనేం చెయ్యలేదు. దానికి నా అసమర్థత ను నిందించను. కానీ ఊరికే ఉండలేను. ప్రస్తుతానికి నిట్టూర్పు తో మీతో ఆ విషయం పంచుకుంటున్నాను.
మా వీథి లో నడుచుకుంటూ వెళ్తున్నాను. నున్నటి తారు రోడ్డు. కొత్తగా వేసినట్లు ఉంది. రోడ్డు పై పక్కనే ఉన్న స్లం యేరియా పిల్లాడు ఒకడు కూర్చుని ఉన్నాడు. ఏదో గీస్తున్నాడు తారు మీద. ఏం రాస్తున్నాడో నాకు అర్థం కాలేదు. దగ్గరకి వచ్చి చూసాను. వాడు అక్కడ చాక్పీసు తీసుకుని అక్షరాలు రాస్తున్నాడు !!!!!!! వాడి ఉద్ధెశ్యాలు ఏవన్నా కావొచ్చు. నున్నటి రోడ్డు ఆకర్షించి ఉండవచ్చు. చాక్పీసు అరిగించాలనిపించి ఉండొచ్చు. నోట్ పుస్తకం లేకపోయి ఉండవచ్చు. కానీ …. ఎందుకో అది నన్ను బాగా కదిలించింది. దాన్ని నేను వాడికి చదువుపట్ల ఆశ గానే అర్థం చేసుకున్నాను. అప్పట్లో అనుకున్నా …. నా చదువు అయిపోయి ఉద్యోగం చేస్తే నేను సంపాదించే డబ్బు లో కాస్తైనా ఇలాంటి పిల్లల చదువుకు నా వంతు క్రుషి చేయాలని.
నా అభిప్రాయం దేశానికైనా మనిషి కైనా భవిస్యత్తు బాగుండాలంటే చదువు ఓ రాచబాట వంటిది అని. ఆ చదువు కూడా అట్టడుగు లో ఉన్న వారికి కూడా అందుబాటు లో ఉండాలి అని. అప్పట్లో విపరీతమైన ఆవేశం ప్రభావం లో – “నేను పెద్దయ్యాక స్కూలు పెట్టాలి. ఇలా అవకాశం లేని పిల్లలు అందరికీ అవకాశం ఇవ్వాలి. వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి.” అంటూ చాలానే ఊహించుకున్నా. ఏమో ఒకానొక రోజు నేను కాకుంటే నాలా ఈ కలలు కన్న మరొకరు తమ కలను నిజం చేసుకుంటారేమో .. నేను చేయకపోయినా. నాలో ఏ కాస్తో ఓ మూల నా సమాజానికి ఏమైనా చేయాలి అని కోరిక రగిల్చిన సంఘటనల్లో ఇది ఒకటి. ఎవరన్నా అడిగితే టక్కున గుర్తు వచ్చేది.
Introduction
సెప్టెంబరు 15, 2006 at 3:40 అపరాహ్నం | In Uncategorized | 1 CommentThere are many blogs in wordpress. I am not saying that this is something special. These are my musings on what the world has taught me. I am this anti-people, asocial person sometimes. But, this blog is about those people or other entities in the world that made me re-think on those asocial moments.
Small gestures that can change somebody’s world
small incidents that taught me big lessons
Normal people who did great things
- This blog is to say what I learnt from the above said, how it changed my view of life.
మానవత్వం లో ని గొప్పతనాన్ని నాకు చెప్పిన వారూ ీ
మనిషి కున్న బాధ్యత ను నాకు గుర్తు చేసిన వారూ
నన్ను ఆలోచింపజేసిన సంఘటన లూ
మనిషి గా నన్ను ప్రభావితం చేసిన ఎన్నో అనుభవాలూ
సమాజానికి నేనేం ఇవ్వగలనూ అని ప్రశ్నింపజేసిన
ప్రపంచంలోని అందరిని, అన్నింటిని గురించి
నా “అనుభవాలు-ఙాపకాలు” ఈ బ్లాగు లో.
WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.